తెలంగాణ వల్లే దేశంలో భూగర్భ జలాలు పెరగాయి: కేటీఆర్

 తెలంగాణ వల్లే దేశంలో భూగర్భ జలాలు పెరగాయి: కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీపై కోపంతో కోపంతో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చవద్దన్నారు మాజీ మంత్రి కేటీఆర్. డిసెంబర్ 24వ తేదీ ఆదివారం తెలంగాణ భవన్ లో కేటీఆర్..  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా 9ఏళ్ల బీఆర్ఎస్ పాలన వివరించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్క బరాజ్ లో చిన్న తప్పు ఉంటే.. మొత్తం ప్రాజెక్టునే తప్పుబడుతున్నారని విమర్శించారు. దేశంలో భూగర్భ జలాలు పెరగడానికి తెలంగాణ రాష్ట్రమే కారణమన్నారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా 50 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆయకట్టు స్థిరీకరణ చేశామని కేటీఆర్ చెప్పారు.   మేడిగడ్డ బరాజ్ లో తప్పు జరిగితే సరిచేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేస్తామని కాంగ్రెస్ చెబుతోందని.. కాళేశ్వరంపై న్యాయ విచారణను స్వాగతిస్తున్నామని అన్నారు. ఏ విచారణకైనా మేం సిద్ధమని.. తప్పు జరిగితే చర్య తీసుకోండని అయన అన్నారు.  

90శాతం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని.. మిగతా పనులు పూర్తి చేసి రైతులకు నీరు ఇవ్వాలని చెప్పారు. కాళేశ్వరం ఫలాలను కాంగ్రెస్ పాలకులు కూడా ఎంజాయ్ చేస్తారని అన్నారు. ఫలాలను అనుభవించడని.. కానీ ప్రాజెక్టులను బద్నాం చేయాలని చూడొద్దన్నారు. ప్రపంచమంతా మనల్ని నిందించే పరిస్థితి తీసుకురాకండని కేటీఆర్ అన్నారు.