ఒకే దేశంలో వ్యాక్సిన్ కు రెండు ధరలు ఎందుకు?

ఒకే దేశంలో వ్యాక్సిన్ కు రెండు ధరలు ఎందుకు?

కోవిడ్ వ్యాక్సిన్ ధరలపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు వన్ నేషన్- వన్ ట్యాక్స్ అన్నారు..ఇపుడేమో ఒకే వ్యాక్సిన్ కు దేశంలో రెండు ధరలు అంటున్నారన్నారు. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 ధర నిర్ణయించడం ఎందుకని ట్వీట్ చేశారు. రాష్ట్రాలపై పడే అదనపు భారాన్నిపీఎం కేర్ నుంచి  భరించలేరా?..దేశమంతా వ్యాక్సినేషన్ పూర్తికి కేంద్రం ప్రయత్నిస్తుందా అని ప్రశ్నించారు. ఒకే దేశం-ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించామన్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400, ప్రైవేట్ కు రూ.600, కేంద్రానికి రూ.150 ఇస్తున్నట్లు సీరమ్ సంస్థ బుధవారం ప్రకటించింది.