
హైదరాబాద్, వెలుగు: రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీ, ఐటీ వంటి రా జ్యాంగ సంస్థలను వాడుకోవడం బీజేపీకి అలవాటేనని, గత పదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఆ పార్టీ అదే పనిచేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కవిత అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు ఈడీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని శుక్రవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఈ నెల 19న కేసు కోర్టులో విచారణకు ఉండగా, ఇంత హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాము లీగల్ ఫైట్ చేస్తామని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కవితకు మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు శనివారం కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు.