
హైదరాబాద్, వెలుగు: మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల వరంగల్ పర్యటన సందర్భంగా పేదల ఇండ్లు కూలుస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అందాల పోటీల కోసం పేదవారి ఇండ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలనా? అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ‘‘హలో రాహుల్ గాంధీ, బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉన్నదా? ప్రతిరోజూ పేదల ఇండ్లతో పాటు వారి జీవితాలపై దాడి చేయడం ఏమిటి? ” అని కేటీఆర్ మండిపడ్డారు.