
లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎమ్మెల్సీ కవితను కావాలనే శుక్రవారం అరెస్ట్ చేశారని కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం (మార్చి 15) మధ్యాహ్నం నుంచిఈడీ, ఇన్కమ్ టాక్స్ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు ఎమ్మెల్సీ కవిత ఇంట్లో మొత్తం 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి 8.45 కు ప్రత్యేక విమానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తరలించనున్నారు. కావాలనే శుక్రవారంఈడీ అదుపులోకి తీసుకుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా.. కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు.
కవిత అరెస్టుపై ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్.. అరెస్ట్ చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నించారు. ‘కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. శని, ఆదివారాలు కోర్టుకు సెలవు ఉంటుందనే ఉద్దేశంతోనే కావాలని శుక్రవారం వచ్చారు’ అని ఆయన ఆరోపించారు.