
లక్ష 30 వేల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామన్నారు కేటీఆర్. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని చెప్పారు. నిరుద్యోగులందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదన్నారు కేటీఆర్. 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో 24 వేల ఉద్యోగాలు మాత్రమే కల్పించారన్నారు. రాష్ట్రంలో 12 లక్షల మంది ప్రయివేట్ టీచర్లున్నారని.. వారందరికీ సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నామన్నారు. చిన్నాచితకా ఆర్థికసాయం చేస్తే.. ఈ మాత్రందానికి ఎందుకు చేసారంటూ మీరే విమర్శిస్తారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రయివేట్ టీచర్లను ఎవరూ అదుకోలేదన్నారు కేటీఆర్. 60 ఏళ్లలో పూర్తి చేయలేనటువంటి వాటిని ఆరేళ్లలో చేశామన్నారు. ఒక్కొక్క విద్యార్థిపై లక్ష 20 వేల రూపాయలు ఖర్చుచేస్తు గురుకులాల ద్వారా వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాంమన్నారు.