కేసీఆర్ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు: కేటీఆర్

కేసీఆర్ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు: కేటీఆర్

సిద్దిపేటలో కేసీఆర్ పుట్టకుంటే తెలంగాణ ఉద్యమం పుట్టేది కాదు.. రాష్ట్రం వచ్చేది కాదన్నారు మంత్రి కేటీఆర్.  ఉద్యమ నాయకుడిని అందించిన జిల్లా సిద్దిపేట గడ్డని అన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావుతో కలిసి ఐటీ టవర్స్ ప్రారంభించారు కేటీఆర్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. సిద్దిపేటను చూసి అసూయపడేలా మంత్రి హరీశ్ రావు అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర సమీకృత సమతుల్య సమ్మిళిత అభివృద్ధి అని అన్నారు. అభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికి దిక్సూచి అని..మిషన్ భగీరథకు పునాది కూడా సిద్దిపేటలోనేనన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని సిద్దిపేటలా అభివృద్ధి చేస్తామన్నారు.ఈ సారి హరీశ్ రావును లక్షా 50 వేల మెజారిటీతో గెలిపించాలన్నారు.

సిద్దిపేటలో ఐటీ హబ్ ను మరింత విస్తరిస్తామన్నారు మంత్రి కేటీఆర్.టాస్క్ తో యువతకి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోందన్నారు. 2014లో ఐటీ ఎగుమతులు 56 వేల కోట్లు ఉంటే..ఇవాళ రెండు లక్షల 41 వేల కోట్లని తెలిపారు. ఏ ప్రభుత్వం అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. తెలంగాణలో యువత ఎక్కువగా ఉందని.. వారికి ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించడం కోసం ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కేసీఆర్ కు హ్యాట్రిక్ గెలుపు ఇవ్వాలన్నారు.

https://www.youtube.com/watch?v=QygcXf9P75Q