లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం.. ఎక్కడైనా చర్చకు రెడీ

లక్షా 32 వేల ఉద్యోగాలిచ్చాం.. ఎక్కడైనా చర్చకు రెడీ

బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్రం ITIR ప్రాజెక్టు ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. TRS ప్రభుత్వం ఆరేళ్లలో లక్షా 32వేల 799 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ఎవరికైనా అనుమానం వుంటే తాను చర్చకు సిద్దమన్నారు. ప్రధాని మోడీ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు.. ఇప్పటికీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.  కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.టీఎస్ ఐపాస్ ద్వారా 14 వేల పైన కంపెనీలు స్థాపించామని.. ఇందులో 14 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశం నిర్వహించారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో GHMC పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మేయర్, డిప్యూటీ మేయర్ సమావేశానికి హాజరయ్యారు. సురభి వాణిదేవి గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు మార్గనిర్దేశం చేశారు కేటీఆర్.  27న హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాల టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం షురూ చేస్తామన్నారు కేటీఆర్. వాణి దేవి, పల్లా భారీ మెజార్టీ తో గెలుస్తరని నమ్మకం ఉందన్నారు. ప్రతి శనివారం నియోజక వర్గ స్థాయిలో పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించాలన్నారు. డిబేట్ లకు వెళ్ళాలని.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు.