
హైదరాబాద్, వెలుగు: హరితహారం మొక్కల సంరక్షణ బాధ్యతను కాలనీ సంక్షేమ సంఘాలకు అప్పగించనున్నట్టుపురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌తెలిపారు. అందుకు కాలనీల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఆరో విడత హరితహారంపై సోమవారం జీహెచ్‌ఎంసీ హెడ్డాఫీస్ లో మంత్రులు శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి , గ్రేటర్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ రామ్మోహన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్షించారు. ఈసారి గ్రేటర్లో 2.5 కోట్ల మొక్కలు నాటుతామని తెలిపారు. హెచ్‌డీ లేన్ రోడ్– మియాపూర్‌మెట్రోస్టేషన్, రైల్వే లైన్ – గచ్చిబౌలి, ప్రశాసన్ నగర్ –నార్నే రోడ్, అల్కాపురి టౌన్ షిప్ -ఉస్మాన్సాగర్ లింక్రోడ్లను మినిస్టర్ కేటీఆర్ సోమవారం ప్రారంభించారు.