ధాన్యం కొనుగోళ్లపై ఎటూ తేలని పంచాయతీ!

ధాన్యం కొనుగోళ్లపై ఎటూ తేలని పంచాయతీ!

ధాన్యం కొనుగోలు అంశంపై కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయెల్, వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ తో భేటీ అయ్యింది. మంత్రి కేటీఆర్ తో పాటు  గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్, పసునూరి దయాకర్, కవిత, మన్నే శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ప్రత్యేక సీఎస్ రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందనరావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ఉన్నారు.  రెండు సీజన్లలో కలిపి 150 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి సేకరించాలని కోరింది బృందం. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు కోటా పెంచేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు చెప్పారు నేతలు. ఉప్పుడు బియ్యం కొనేలా కేంద్రం ప్రకటన చేయాలని కోరారు .