శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (SRDP) లో భాగంగా నిర్మించిన శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ బ్రిడ్జిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ రేపు  ప్రారంభించనున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సిటీలో 16 ఫ్లైఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రేపు 17వ ఫ్లై ఓవర్ శిల్ప లే ఔట్ ఫ్లై ఓవర్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ORR నుంచి గచ్చిబౌలి మీదుగా పఠాన్ చెరు, కోకాపేట్, నార్సింగ్ నుంచి ఎయిర్ పోర్ట్ కు వెళ్లేందుకు ఈజీ అవుతుందని అధికారులు చెప్తున్నారు.