కంటోన్మెంట్ కార్యకర్తలకు మే 31న కేటీఆర్ ట్రైనింగ్

కంటోన్మెంట్ కార్యకర్తలకు మే 31న కేటీఆర్ ట్రైనింగ్

పద్మారావునగర్, వెలుగు: ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 31న సికింద్రాబాద్ కంటోన్మెంట్​కు రానున్నారు. బాలంరాయ్​లోని క్లాసిక్ గార్డెన్​లో నిర్వహించనున్న ఈ శిక్షణా శిబిరంలో బూత్ స్థాయి నాయకులు పాల్గొంటారు. 

గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఈ వేదికగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని కంటోన్మెంట్ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్​చార్జ్ మన్నె క్రిశాంక్ తెలిపారు.