అభిమాని ఇంటికి వెళ్లిన కేటీఆర్

అభిమాని ఇంటికి వెళ్లిన కేటీఆర్
  •     ఇబ్రహీం ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం

హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన అభిమాని ఇబ్రహీం ఖాన్ ను సర్ ప్రైజ్ చేశారు. బోరబండలో గాజుల దుకాణం నడిపే ఆయన​ఇంటికి ఆదివారం సాయంత్రం​కేటీఆర్​వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. కొన్ని రోజుల క్రితం ఇబ్రహీం ఖాన్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. తన ఇంటికి వచ్చి అతిథ్యం స్వీకరించాలని  కోరారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్ తాజాగా ఇబ్రహీం ఇంటికి వెళ్లారు.

ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉంటానని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన పిల్లల మూగచెవుడు ట్రీట్​మెంట్​కోసం వ్యక్తిగతంగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. బోరబండకు కేటీఆర్ రావడంతో పెద్ద ఎత్తున స్థానికులు ఇబ్రహీం ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారందరికీ కేటీఆర్ అభివాదం చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. కేటీఆర్ వెంట మాగంటి గోపినాథ్, బీఆర్ ఎస్ నాయకులు ఉన్నారు.