
ఉప్పల్, వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ సోమవారం పరామర్శించారు.రాజిరెడ్డి సోదరుడు, ప్రస్తుత ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాజిరెడ్డి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఉప్పల్ బీఆర్ఎస్ ఇన్చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.