క్రిటికల్ కండీషన్ లో ఉన్న మహేశ్​ను ఆదుకోండి

క్రిటికల్ కండీషన్ లో ఉన్న మహేశ్​ను ఆదుకోండి

వరంగల్‍, వెలుగు: కరోనాతో ఎంజీఎంలో వెంటిలేటర్​ మీద చికిత్స పొందుతున్న కేయూ జేఏసీ లీడర్​ దబ్బేటి మహేశ్​కు మెరుగైన వైద్యం అందించాలని స్టూడెంట్​ లీడర్లు ప్రభుత్వాన్ని కోరారు. సీఎం కేసీఆర్​, మంత్రులు కేటీఆర్, హరీశ్​రావు ఈమేరకు చొరవ తీసుకోవాలని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన మహేశ్​ కరోనాతో నవంబర్​16న ఎంజీఎం హాస్పిటల్​లో చేరారు. ఆయన పరిస్థితి క్రిటికల్​గా మారినా కార్పొరేట్​ వైద్యాన్ని అందించే ఆర్థిక స్థోమతలేక ఇక్కడ చేర్పించారు. ప్రస్తుతం సుబేదారి పీజీ కాలేజీలో పార్ట్​టైమ్ లెక్చరర్​గా పని చేస్తున్న మహేశ్​ కు ఆరునెలలకోసారి వచ్చే జీతం కుటుంబపోషణకే సరిపోవడంలేదని, చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని బతికించుకునేందుకు కుటుంబసభ్యులు కష్టాలు పడుతున్నారని వారు చెప్పారు. దాతలు స్పందించి మహేశ్​ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఫోన్​పే ద్వారా 77022 13771 కు తమ సాయాన్ని పంపాలని కోరారు.

మహబూబాబాద్​ జిల్లా కురవికి  చెందిన డాక్టర్​ దబ్బేటి మహేశ్​  కేయూ జేఏసీలో కీలకంగా పనిచేశారు. ఆయనపై ఉద్యమ సమయంలో చాలా  కేసులు నమోదయ్యాయి. అప్పటి సీఎం కిరణ్​కుమార్ రెడ్డి ములుగు మండలం రాయినిగూడెం పర్యటనలో పోలీసు వలయాన్ని దాటి నిరసన తెలిపిన నలుగురు స్టూడెంట్లలో మహేశ్​ ఒకరు. ఓయూ నుంచి కేయూ వరకు జరిగిన పాదయాత్రలో ఆయన సుమారు 500 కిలోమీటర్లు  నడిచారు.దాదాపు50పైగా కేసులు నమోదయ్యాయి. వరంగల్​ సెంట్రల్​ జైలులో ఉన్నారు.