కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న కేయూ విద్యార్థులు

కేసీఆర్ కాన్వాయ్ ని అడ్డుకున్న కేయూ విద్యార్థులు

వరంగల్ : సీఎం కేసీఆర్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం కాన్వాయ్ ను కేయూ జేఏసీ విద్యార్థులు అడ్డుకున్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాన్వాయ్ కు అడ్డుగా వెళ్లారు. కేసీఆర్ డౌన్ డౌన్ ఖబర్దార్ కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. వెంటనే తేరుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. వరంగల్ కలెక్టరేట్ ప్రారంభానికి సీఎం కేసీఆర్ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా విద్యార్థులు రావడం చర్చనీయాంశమైంది.