బీఆర్ఎస్ కు కూచాడి శ్రీహరిరావు రాజీనామా

బీఆర్ఎస్ కు  కూచాడి శ్రీహరిరావు రాజీనామా

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న కూచాడి శ్రీహరిరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఉద్యమంలో ముందుండి పోరాడినా రాష్ట్ర ఏర్పాటు  తర్వాత సరైన గుర్తింపు రాలేదన్నారు.  పార్టీలో చేరిన తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నానని చెప్పారు.  తనకు, తన అనుచరులకు ఎటువంటి నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదని.. చిన్నచూపు చూశారన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని ఆశ చూపి ఇవ్వలేదన్నారు.  ఇంకా అవమానాలు భరించకూడదన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ కు  గుడ్ బై చెబుతున్నానని వెల్లడించారు.

రెండు సార్లు గెలిచి బీఆర్ఎస్ ప్రజలను వంచించిందన్నారు. ఇలాంటి మోసాలు చూడటం ఇష్టంలేకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.  జూన్ 13న  తన అనుచరులతో చర్చించి ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటానని చెప్పారు.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.