సమంత వ్యక్తిగత వివరాలను వెంటనే తొలగించండి

 సమంత వ్యక్తిగత వివరాలను వెంటనే తొలగించండి
  • సోషల్‌ మీడియాలో సమంతపై పెట్టిన కామెంట్స్‌  తొలగించాలి

హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టులో సమంతకు భారీ ఊరట లభించింది. సమంత వ్యక్తిగత వివరాలను ప్రసారం చేయడానికి వీళ్లేదని.. యూట్యూబ్‌ ఛానెల్స్‌ వెంటనే అలాంటి కంటెంట్‌ని తొలగించాలని ఆదేశించింది. ఆమె వ్యక్తిగత విషయాలపై సోషల్‌ మీడియాలో పెట్టిన కామెంట్స్‌ని కూడా డిలీట్ చేయాలని సూచించింది.

ఇటీవల సమంత, నాగచైతన్య విడిపోతున్నట్టు ప్రకటించిన సమయంలో వారి విడాకులపై అనేక కథనాలు వచ్చాయి. సీఎల్ వెంకట్రావు అనే వ్యక్తితో పాటు పలు యూట్యూబ్ చానళ్లు తన వ్యక్తిగత జీవితంపై ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేస్తున్నాయంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు నష్టం కలిగించేలా దుష్ప్రచారం చేశారంటూ ఆమె కూకట్ పల్లి కోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి..సమంత దాఖలు చేసిన పిటిషన్‌ను ఇవాళ(మంగళవారం) కూకట్‌పల్లి కోర్టు విచారించింది. సమంత ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యవహరించిన రెండు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు, డాక్టర్ సీఎల్ వెంకట్ రావు ప్రసారాలు చేసిన యూట్యూబ్ లింకులను వెంటనే తొలగించాలని కూకట్ పల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు..యూట్యూబ్ చానళ్లు ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడరాదని ఆదేశాలు జారీ చేసింది.