కన్నకూతురితో అసభ్య ప్రవర్తన.. తండ్రికి జీవిత ఖైదు

కన్నకూతురితో అసభ్య ప్రవర్తన.. తండ్రికి జీవిత ఖైదు

జీడిమెట్ల, వెలుగు: కన్నకూతురితో అసభ్యంగా ప్రవర్తించిన తండ్రికి కూకట్​పల్లి ఫాస్ట్​ట్రాక్ స్పెషల్​కోర్టు జీవితఖైదు, రూ.50 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాల ప్రకారం... జగద్గిరిగుట్ట పరిధిలో నివాసముండే వ్యక్తి  2024లో అతని 5వ తరగతి చదువుతున్న కూతురు స్నానం చేస్తుండగా డోర్​ తీసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం బాలికి తన తల్లికి చెప్పడంతో భర్తను ప్రశ్నించింది. 

దీంతో అతడు ఇద్దరిని బెదిరించాడు. గతంలో సైతం తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కూతురు తల్లికి చెప్పడంతో తట్టుకోలేక పోయిన తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటి సీఐ క్రాంతికుమార్​ కేసు నమోదు చేసి సాక్షాధారాలతో నిందుతుడిని అరెస్ట్​ చేసి, కోర్టులో హజరు పరిచారు. కేసు పరిశీలించిన ఫాస్ట్​ట్రాక్ కోర్టు జడ్జి అమరావతి అనీల్​గౌడ్​కు బుధవారం వ్యక్తికి జీవిత ఖైదు, రూ.70వేల జరిమానా విధించింది.