కూకట్పల్లి జేఎన్టీయూలో జాబ్ మేళా.. రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు జీతం.. వెయ్యికిపైగా జాబ్స్.. త్వరపడండీ

కూకట్పల్లి జేఎన్టీయూలో జాబ్ మేళా.. రూ.లక్ష నుంచి రూ.6 లక్షల వరకు జీతం.. వెయ్యికిపైగా జాబ్స్.. త్వరపడండీ

జాబ్స్ కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు కూకట్ పల్లి జేఎన్టీయూ గుడ్ న్యూస్ చెప్పింది. జేఎన్టీయూ యూనివర్సిటీలో మార్చి 1వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కిషన్ కుమార్ రెడ్డి వెల్లడించారు . ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను ఇవాళ (ఫిబ్రవరి 24) ఆవిష్కరించారు. 

యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంట్రాక్షన్,  నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ, హెచ్ఆర్ కో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో ముఖ్యంగా వెయ్యికి పైగా జాబ్స్ ఉంటాయని, మహిళలకు అధికంగా అందించేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని మంచి జాబులు సాధించాలని వారు కోరారు. 

ఈ మెగా జాబ్ మేళాలో 100కు పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. జాబ్స్ కు ఎంపికైన అభ్యర్థులకు సాలరీ ఒక లక్ష ఎనిమిది వేల నుంచి రూ.6 లక్షల వరకు ప్యాకేజీ అందించే ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు.