లేక్షోర్ మాల్లో తప్పిన పెను ప్రమాదం

 లేక్షోర్ మాల్లో తప్పిన పెను ప్రమాదం
  • హోర్డింగ్స్ పడి ఇద్దరికి గాయాలు

కూకట్​పల్లి, వెలుగు: కూకట్​పల్లి వై జంక్షన్​లోని లేక్‌‌ షోర్ మాల్​లో ఆదివారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. మాల్ లోపల ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్స్, సైన్ బోర్డులు ఒక్కసారిగా పైనుంచి కింద పడడంతో షాపింగ్​కు వచ్చిన గద్దె మనోజ్ఞ (27), బండి దివ్య (27) అనే ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి.

హోర్డింగ్స్ పడిన సమయంలో ఆ ప్రాంతంలో జనం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. ఇటీవలే మాల్ ప్రారంభం కాగా, ప్రజలు ఉన్న సమయంలోనే ప్రమాదకరంగా పనులు చేపట్టడంపై సందర్శకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించగా,  ఈఘటనపై కూకట్​పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.