అడవి బిడ్డల జోలికొస్తే బిడ్డ కేసీఆర్ పాతర వేస్తాం

అడవి బిడ్డల జోలికొస్తే బిడ్డ కేసీఆర్ పాతర వేస్తాం

అడవి బిడ్డల జోలికొస్తే బిడ్డ కేసీఆర్ పాతర వేస్తామన్నారు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మంగళవారం అశ్వారావుపేటలో జరిగిన అఖిలపక్షం పోడు రైతుల సదస్సులో పాల్గొని మాట్లాడిన కూనంనేని సాంబశివరావు..విల్లంబులు బాణాలు చేత పట్టుకొని పోడు భూములు కాపాడుకుంటామన్నారు. భగత్ సింగ్, అల్లూరి, కొమ్రం బీమ్ ఉద్యమ స్ఫూర్తితో  పొడు భూములు కాపాడుకుంటామన్నారు. ఆదివాసీ బిడ్డలకు అడవితో తల్లి లాంటి అనుబంధం ఉందన్నారు. అడివిలో పుట్టి చెట్టును.. పుట్టను నమ్ముకొని  జీవిస్తూ ..పోడు  భూమిని నమ్ముకొని జీవిస్తున్నారని తెలిపారు. నూరేళ్లుగా పోడు వ్వవసాయం చేస్తుంటే.. బంగారు తెలంగాణ సాధిస్తా అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్..  ముఖ్యమంత్రి అయ్యాక పేద ప్రజలపై, గిరిజనులుపై దాడులు ప్రకటించారన్నారు.

ప్రతి పేదవాడికి 3ఎకరాలు భూమి ఇస్తానని ఇచ్చిన హామీ తుంగలో తొక్కి, తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు పేదలు సాగు చేస్తున్న 5 లక్షల ఎకరాల్లో హరితహారం పేరుతో పంట భూములు లాక్కుని మొక్కులు వేశారన్నారు. కేసీఆర్ నోరులేని అడివి బిడ్డల జోలికి వస్తే ఎర్ర జెండా సాక్షిగా  తిరుగుబాటు చేస్తామన్నారు. ఆక్టోబర్ 5న అశ్వారావుపేట నుంచి ఆదిలాబాద్ వరకు ప్రతి అంగుళం కూడా వదలకుండా ప్రతి పోడు సాగుదారులు రోడ్డుపైకి వచ్చి ఉద్యమం ఉవ్వెత్తున చేస్తామని తెలిపారు. కేసీఆర్ పతనం ఈ ఉద్యమంతో స్టార్ట్ అవుతుందన్నారు.  చరిత్రలోనే ఎంతో మంది పాలకులు హిట్లర్, బ్రిటిష్, నైజాం పాలకులను ప్రారదోలిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలదన్న ఆయన.. ఎర్ర జెండా ఉంటుందని గుర్తుంచుకోవాలంటూ కేసీఆర్ ను హెచ్చరించారు.