ఇబ్రహీంపట్నం/అత్తాపూర్/బడంగ్పేట్/చార్మినార్, వెలుగు: ఈ సారి గణేశుడి లడ్డూలకు భారీ ధర పలికింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్ల చౌరస్తాలో బుర్జు మైసమ్మ ఆలయ వినాయకుడి లడ్డూప్రసాదం లడ్డూను ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి రూ. 21లక్షలకు చేజిక్కించుకున్నారు.
అత్తాపూర్లోని పురాతన పోచమ్మ ఆలయం వద్ద నవశక్తి భక్త సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డూ కోసం 50 మంది పోటీపడ్డారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన వేలంలో గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి రూ.13 లక్షల 21 వేలకు దక్కించుకున్నారు.
బడంగ్పేట్లడ్డూ కోసం 10 మంది పోటీ పడగా చివరకు రూ.10.50 లక్షలకు ఆర్వీఆర్ క్లౌడ్ కిచెన్ టీం కైవసం చేసుకుంది. కాలాపత్తర్ పీఎస్పరిధిలోని మోచీ కాలనీలో మహేష్ గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంలో లడ్డూను కాలాపత్తర్ సీఐ మహమ్మద్ఖలీల్పాషా రూ.33వేలకు కైవసం చేసుకున్నారు. తర్వాత ఆయన లడ్డూను ఊరేగింపుగా పీఎస్కు తీసుకువెళ్లారు.
