
ఏపీలో హంగ్ వచ్చే అవకాశం లేదని స్పష్టమైన మెజారిటీతోనే ప్రభుత్వం ఏర్పడబోతుందని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఏపీలో సైకిల్, తెలంగాణలో కారు హవా కొనసాగుతుందన్న లగడపాటి.. కేంద్రంలో ఏ కూటమికి అధిక్యం రాదన్నారు. ఏపీలో గతంలో కంటే రెండు ప్రధాన పార్టీలకు ఓటింగ్ శాతం తగ్గుతుందన్నారు. జనసేనకు ప్రజారాజ్యం కంటే తక్కువ సీట్లు వస్తాయని.. అయితే పవన్ ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతాడని చెప్పారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ కాబట్టి కారును ఎంచుకున్నారు. ఏపీలో లోటు బడ్జెట్ కాబట్టి ప్రజలకు సైకిల్ మార్గం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారనేది తిరుపతిలో రేపు సాయంత్రం 6 గంటలకు చెబుతానని అన్నారు లగడపాటి.