లక్షద్వీప్ కు కలిసొచ్చిన మాల్దీవులతో వివాదం.. మోస్ట్ సెర్చింగ్ లో ప్లేస్

లక్షద్వీప్ కు కలిసొచ్చిన మాల్దీవులతో వివాదం.. మోస్ట్ సెర్చింగ్ లో ప్లేస్

ఇండియా - మాల్దీవుల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా.. ఇప్పుడు చాలా మంది మన దేశంలోనూ చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సందర్శించాలని సూచిస్తున్నారు. అందులో చాలా మంది సూచిస్తున్న పేరు లక్షద్వీప్. 36 దీవులను కలిగి ఉన్న ఈ అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోనే అపూర్వమైన ప్రజాదరణను పొందింది. MyGovIndia నుండి వచ్చిన డేటా ప్రకారం, గడిచిన రెండు దశాబ్దాలలో ప్రపంచంలో చాలా ఆసక్తి కనబర్చిన దీవులుగా లక్షద్వీప్ నిలిచింది. ఈ సందర్భంగా ఎక్స లో పోస్ట్ చేసిన MyGovIndia.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన కారణంగా దీవుల గురించి ఆన్‌లైన్ లో చాలా మంది ఈ ప్రదేశం కోసం సెర్చ్ చేస్తున్నారని చెప్పింది. ఈ ప్రపంచవ్యాప్త శోధన ఆసక్తి ప్రస్తుతం గత 20 సంవత్సరాల కంటే అత్యధికంగా ఉంది. ఇది దాని సహజ సౌందర్యం, సాంస్కృతిక గొప్పతనాన్ని సూచిస్తుందని MyGovIndia పేర్కొంది.

అధికారిక డేటా లక్షద్వీప్ దీవులపై చాలా మంది ఈ ప్రదేశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ, ట్రావెల్ ప్లాట్‌ఫారమ్‌లు, టూర్ ఆపరేటర్‌ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఉదాహరణకు, ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ మేక్ మై ట్రిప్ (MakeMyTrip).. ప్రత్యేకంగా లక్షద్వీప్ కోసం ఆన్-ప్లాట్‌ఫారమ్ సెర్చింగ్ లలో 3400% పెరిగినట్లు నివేదించింది. ఈ ఆసక్తి పెరుగుదల ఈ సుందరమైన గమ్యాన్ని అన్వేషించాలనే ఆసక్తిని,  ప్రయాణీకులలో ఉత్సుకతను పెంచుతుంది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ఆ కంపెనీ భారతీయ బీచ్‌లపై ఉన్న ఈ ఆసక్తి, దేశంలోని అద్భుతమైన బీచ్‌లను అన్వేషించడానికి భారతీయ ప్రయాణికులను ప్రోత్సహించడానికి ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో ప్లాట్‌ఫారమ్‌లో 'బీచ్‌ ఆఫ్ ఇండియా' అనే ప్రచారాన్ని ప్రారంభించేందుకు తమకు స్ఫూర్తినిచ్చిందని చెప్పుకొచ్చింది.