
యాదాద్రి క్షేత్రంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు ముగిశాయి. మూడు రోజులుగా జరుగుతున్న ఉత్సవాలను…. మహా పూర్ణాహుతి, సహస్ర కలశాభిషేకంతో ముగించారు అర్చకులు. ముగింపు కార్యక్రమంలో సహస్ర కలశాభిషేకం ఘనంగా జరిగింది. వేయి కలశాలను వరుసగా పేర్చి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఉత్సవాలు ముగియడంతో రేపటి నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభిస్తారు.