హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీ..ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌

హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీ..ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌

సార్బ్రూకెన్ (జర్మనీ): ఇండియా స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌.. హైలో ఓపెన్‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌–500 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌‌‌‌‌లో లక్ష్య 21–16, 22–20తో ఐదోసీడ్‌‌‌‌‌‌‌‌ క్రిస్టో పొపోవ్‌‌‌‌‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌‌‌‌‌)పై సంచలన విజయం సాధించాడు. 47 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో పొపోవ్‌‌‌‌‌‌‌‌ నుంచి గట్టి పోటీ ఎదురైనా ఇండియన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు తట్టుకుని నిలబడ్డాడు.

 రెండో గేమ్‌‌‌‌‌‌‌‌లో 17–20తో వెనకబడినా.. స్మాష్‌‌‌‌‌‌‌‌లు, ర్యాలీలతో వరుసగా పాయింట్లు గెలిచి 20–20తో స్కోరు సమం చేశాడు. ఈ క్రమంలో నెట్‌‌‌‌‌‌‌‌ వద్ద రెండు సూపర్‌‌‌‌‌‌‌‌ డ్రాప్స్‌‌‌‌‌‌‌‌ వేసి విజయం అందుకున్నాడు. మరో మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో శంకర్‌‌‌‌‌‌‌‌ ముత్తుస్వామి 21–14, 18–21, 21–16తో లియోంగ్‌‌‌‌‌‌‌‌ జున్‌‌‌‌‌‌‌‌ హో (థాయ్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌)పై గెలవగా, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ 19–21, 11–21తో కిరణ్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడాడు. విమెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో శ్రియాన్షి 21–19, 21–12తో లైన్‌‌‌‌‌‌‌‌ హుజ్‌‌‌‌‌‌‌‌ మార్క్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌)పై, ఉన్నతి హుడా 21–4, 21–13తో జూలియనా వియానా విరియా (బ్రెజిల్‌‌‌‌‌‌‌‌)పై నెగ్గగా, అనుపమ ఉపాధ్యాయ 19–21, 19–21తో పోలినా బుహురోవా (ఉక్రెయిన్‌‌‌‌‌‌‌‌) చేతిలో, అన్మోల్‌‌‌‌‌‌‌‌ ఖర్బ్‌‌‌‌‌‌‌‌ 24–26, 21–23తో జూలి డావల్‌‌‌‌‌‌‌‌ జాకబ్‌‌‌‌‌‌‌‌సెన్‌‌‌‌‌‌‌‌ (డెన్మార్క్‌‌‌‌‌‌‌‌) చేతిలో, ఆకర్షి కశ్యప్‌‌‌‌‌‌‌‌ 15–21, 15–21తో నెస్లిహన్‌‌‌‌‌‌‌‌ హరిన్‌‌‌‌‌‌‌‌ (చైనా) చేతిలో ఓడారు.