ధూం.. ధాంగాఘటాల ఊరేగింపు

ధూం.. ధాంగాఘటాల ఊరేగింపు
  •     భక్తుల జయజయ ధ్వానాలతో ఊగిపోయిన పాతబస్తీ
  •     వేలాదిగా పాల్గొన్న భక్తులు
  •     స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచిన  నాలుగు యుగాల శకటాలు

హైదరాబాద్, వెలుగు: పాతబస్తీలో ఘటాల ఊరేగింపు ధూం..ధాంగా సాగింది. సోమవారం సాయంత్రం లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం వద్ద రంగం నిర్వహించారు. తర్వాత ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో హరిబౌలిలోని అక్కన్నమాదన్న ఆలయం నుంచి ఘటాల ఊరేగింపు మొదలైంది. సిటీ సీపీ శ్రీనివాస్​రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. అంబారీపై కొలుదీరిన సింహవాహిని మహంకాళి పాతబస్తీ పురవీధుల్లో ముందుకు సాగగా, దారిపొడవునా భక్తులు ఘన స్వాగతం పలికారు.

 నాలుగు యుగాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన శకటాలు స్పెషల్​అట్రాక్షన్​గా నిలిచాయి. మీర్​ఆలం మండి శ్రీమహంకాళేశ్వర ఆలయ ఘటం భారీ శకటాలు ముందుకు సాగాయి. తెలంగాణ, ఏపీతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వచ్చిన 400 మంది కళాకారులు తమ ప్రదర్శనలతో అదరగొట్టారు. స్పెషల్​క్రాకర్స్, లైటింగ్​షోలతో చార్మినార్, మక్కా మసీదుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలు దద్దరిల్లాయి.