
సూర్యాపేట జిల్లా కోదాడలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అటవీశాఖ ఉద్యోగి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బుధవారం ( ఆగస్టు 20 ) జరిగిన ఈ దాడులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. కోదాడలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా పని చేస్తున్న వెంకన్న చెట్ల వ్యాపారి నుంచి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా వెంకన్నను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంకన్నను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో సోదాలు నిర్వహించారు అధికారులు.