Sara Tendulkar: రికార్డ్స్, రివార్డ్స్ కాదు.. మా నాన్న కెరీర్‌లో అదే నాకు ఫేవరేట్ మూమెంట్: సారా టెండూల్కర్

Sara Tendulkar: రికార్డ్స్, రివార్డ్స్ కాదు.. మా నాన్న కెరీర్‌లో అదే నాకు ఫేవరేట్ మూమెంట్: సారా టెండూల్కర్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వరల్డ్ క్రికెట్ లో వేసిన ముద్ర ఎలాంటిందో సగటు క్రికెట్ అభిమానికి తెలుసు. క్రికెట్ గాడ్ అనే ట్యాగ్ సచిన్ కు ఇచ్చారంటే ఎన్ని ఘనతలు సొంతం చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచ క్రికెట్ లో దాదాపు సగం బ్యాటింగ్ రికార్డ్స్ సచిన్ తన ఖాతాలో వేసుకున్నాడు. 24 ఏళ్ళ పాటు భారత క్రికెట్ లో తన సేవలను అందించిన సచిన్ కు ఏకంగా భారత రత్న అవార్డు లభించింది. అంతేకాదు క్రికెట్ చేసిన సేవలకు గాను బీసీసీఐ ‘లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్’ అవార్డు వరించింది. ఇంత ఖ్యాతి సాధించిన సచిన్ టెండూల్కర్ కెరీర్ లో తన ఫేవరేట్ మూమెంట్ ఏంటో అతని కూతరు సారా టెండూల్కర్ చెప్పుకొచ్చింది.

ఇటీవల ఇండియా టుడేతో జరిగిన ఇంటర్వ్యూలో సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌ను తన తండ్రి కెరీర్‌లో తనకు ఇష్టమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసుకోవాలని అడిగారు. ఆసక్తికరంగా సారా సెంచరీలు.. రికార్డులను ప్రస్తావించకుండా 2013లో వాంఖడేలో జరిగిన ఫేర్ వెల్ టెస్ట్ అని చెప్పింది. సారా మాట్లాడుతూ.. " నేను ఒక ఫేవరేట్ మూమెంట్ ను ఎంచుకోవాల్సి వస్తే మా నాన్న రిటైర్మెంట్ ప్రకటించిన చివరి   మ్యాచ్‌ను ఎంచుకుంటాను. రిటైర్మెంట్ ప్రకటించేటప్పుడు ఆ సమయంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేంత వయస్సు నాకు అప్పుడు  ఉంది. అది నాకు ఫేవరేట్ మూమెంట్. నేను చిన్నతనంలో మ్యాచ్ లకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఎంజాయ్ చేసేదాన్ని". అని సారా చెప్పుకొచ్చింది.

తిరుగులేని క్రికెట్ ఆడిన సచిన్, 2013 నవంబర్ 16న తన హోం గ్రౌండ్ అయిన వాంఖెడే స్టేడియంలో వెస్టిండీస్ తరుపున తన ఆకరి టెస్ట్ మ్యాచ్ ఆడి క్రికెట్ కి వీడ్కోలు పలికాడు. ఆ మ్యాచ్ లో 74 నాలుగు పరుగులు చేశాడు సచిన్. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 కెరీర్ లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన సచిన్,  34,357 పరుగులు చేశాడు. అందులో 100 సెంచరీలున్నాయి.ఈ ప్రయాణంలో చెప్పలేని గొప్ప ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి. 

ALSO READ : గిల్‌కు ఎంత కష్టమొచ్చింది..

ఆస్ట్రేలియాపై ఆడిన 144 ఇన్నింగ్స్ లో 50 సగటుతో 6,707 రన్స్ చేశాడు. అందులో 20 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టుపై ఏ ఆటగాడు ఇన్ని రన్స్ చేయలేదు.సచిన్ టెండుల్కర్ కెరీల్ లో 1998 ముఖ్యమైన సంవత్సరం. ఆ ఏడాది 42 ఇన్నింగ్స్ లో 68.67 సగటుతో 2541 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డలపై టెస్ట్ క్రికెట్ లో 50 యావరేజ్ మెయిన్ టైన్ చేసిన ఆటగాడు సచిన్ ఒక్కడే. 2003లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ లో 11 మ్యాచ్ ల్లో 89.25 సగటుతో 673 పరుగులు చేశాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాటర్ సచిన్‌.