
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గ్రహాలు.. ఒక రాశి నుంచి మరో రాశిలో మారుతుంటాయి. గ్రహాల కదలికలను బట్టి.. ఆయారాశుల వారి ఆర్థిక స్థితిగతులు మారతాయి. జాతక చక్రంలో శుక్రుడు కీలకపాత్ర పోషిస్తాడు. ఆయన అనుగ్రహం లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతటి పవర్ ఫుల్ శుక్రుడు.. ఈ రోజు ( ఆగస్టు 21 ) తెల్లవారు జామున ఉదయం 1.25 గంటలకు కర్కాటకరాశిలోకి ప్రవేశించడం వలన లక్ష్మీనారాయణ యోగం ఏర్పడింది . ఆ రాశిలో సెప్టెంబర్ 14 వరకు కొనసాగుతాడు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రుడు.. కర్కాటకరాశిలో సంచరించే సమయంలో ఏ రాశి వారికి ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
మేషరాశి: కర్కాటక రాశిలో శుక్ర సంచారం వలన ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలని సండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం మీ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వ్యాపారస్తులకు మంచి జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల్లో ఆత్మ విశ్వాశం పెరుగుతుంది.
వృషభ రాశి : కర్కాటక రాశిలో శుక్రుడు సంచరిన్నంత కాలం ఉత్సాహంగా గడుపుతారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ప్రతిఫలం పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు .. ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు.
మిథున రాశి : శుక్రుడు .. కర్కాటక రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు అధికమవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగులకు జాబ్ లభించే అవకాశం ఉంది. వివాదాలకు .. గొడవలకు దూరంగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు బిజీగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.
కర్కాటక రాశి: శుక్రుడు.. కర్కాటక రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారికి పనిభారం పెరుగుతుంది. ఉద్యోగస్తులు ప్రశంశలు అందుకుంటారు. సమాజంలో గౌరవం .. కీర్తి.. ప్రతిష్టలు పెరుగుతాయి. కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు ఆనందంగా గడుపుతారు. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. సంతాన యోగం కలుగుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
సింహ రాశి : కర్కాటక రాశిలో శుక్ర సంచారం వలన ఈ రాశి వారికి శత్రువులు పెరిగే అవకాశం ఉంది.
మనస్సు కలత చెందుతుంది.అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా తీర్పులు వస్తాయి. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. డబ్బు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు.
కన్య రాశి : ఈ రాశి వారికి సెప్టెంబర్ 14 వరకు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. కొత్త ప్రాజెక్ట్ ను చేపట్టే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. పూర్వీకుల ఆస్తి కలసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్తగా ప్రేమ చిగురించే అవకాశం ఉంది. ఎలాంటి ఆందోళన చెందకండి.. జీవితం సాఫీగా సాగిపోతుంది.
తులా రాశి : శుక్రుడు .. కర్కాటక రాశిలో సంచరించడం వలన ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు బాగా అనుకూలంగా ఉంటుంది. వేతనం పెరగడం.. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ రావడం.. కావలసిన ప్రదేశానికి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ లభించే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం.. కీర్తి.. ప్రతిష్టలు వృద్ది చెందుతాయి. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టేందుకు.. బిజినెస్ ను విస్తరించే అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి : శుక్రుడు .. కర్కాటక రాశిలో సంచరించడం వలన ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసన ఖర్చులు మానసికంగా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. ఉద్యోగస్తులు అనవసరంగా మాటపడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ప్రశాంతంగా ఉండి .. ఆధ్యాత్మిక చింతనతో గడపండి అంతా మంచే జరుగుతుంది.
ధనుస్సు రాశి : శుక్రుడు .. కర్కాటక రాశిలో సంచరిన్నంత కాలం ఈ రాశి వారుఈరోజు అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. మీ కలలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. చేతికి వచ్చిన అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. మీ కృషికి సరైన ఫలితాలను పొందుతారు. వ్యాపార స్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. అనుకున్న పనిని సాధిస్తారు.
మకర రాశి : శుక్రుడు కర్కాటకరాశిలో సంచారం.. ఈ రాశి వారి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం విషయంలో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు చాలా సంతోషంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్ట్‌తో చాలా బిజీగా ఉంటారు. పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
►ALSO READ | జ్యోతిష్యం: వినాయకచవితి ఆగస్టు 27 : ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి..
కుంభ రాశి : సెప్టెంబర్ 14 వరకు ఈ రాశి వారికి కొంత కష్టంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగులు తమ పనిలో బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి.ఎవరిని గుడ్డిగా నమ్మవద్దని పండితులు సూచిస్తున్నారు. తల్లి దండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలను వాయిదా వేయండి.
మీన రాశి : సెప్టెంబర్ 14 వరకు ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులకు మద్దతు లభిస్తుంది. కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ తండ్రి నుండి మద్దతు లభిస్తుంది. మేధోపరమైన పనుల్లో గౌరవం లభిస్తుంది