జ్యోతిష్యం: వినాయకచవితి ఆగస్టు 27 : ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి..

జ్యోతిష్యం:  వినాయకచవితి ఆగస్టు 27  : ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలి..

దేశ వ్యాప్తంగా వినాయక సంబరాలకు భక్తులు సిద్దమవుతున్నారు.  ఆ తొమ్మిది రోజుల పాటు కొంతమంది నిష్టగా దీక్షతో పూజిస్తారు.    జ్యోతిష్యం నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం .. ప్రతి రాశి వారు  ఏ ఏడాది వారి జాతకంలో ఉండే గ్రహాలు చెడు ప్రభావం నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని మంత్రాలు ఈ తొమ్మది రోజుల పాటు పఠించాలని పండితులు చెబుతున్నారు..  ఇప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రం చదవాలో తెలుసుకుందాం. .. . 

వినాయక చవితి.. గణేశుడి పుట్టిన రోజు.. గణేష్​ చతుర్ధి.. ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్లపక్షం చవితి తిథి నాడు వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 27న ఈ పండుటను జరుపుకుంటున్నాము.   పది రోజుల పాటు జరుపుకొనే ఈ పండగకు  దేశ వ్యాప్తంగా జనాలు రడీ అవుతున్నారు.   జాతక నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం  జీవితంలో  ఉత్తమమైన ఫలితాలు సాధింయచాలంటే వినాయకచవితి రోజున కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.  ప్రతి రాశి వారు వారి రాశిని అనుసరించి వినాయకుడి మంత్రాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు తొలగిపోవాలంటే గణేశుడి అనుగ్రహం అవసరమని పండితులు అంటున్నారు.  

ALSO READ : జ్ఞానోదయం అంటే ఏమిటి.. బుద్దుడు వివరణ ఇదే..!

  • మేష రాశి:   ఓం వక్రతుండాయ నమ:
  • వృషభ రాశి: ఓం గం గణపతయే నమ: 
  • మిథున రాశి:  ఓం ఏకదంష్ట్రాయ నమ: 
  • కర్కాటక రాశి:  ఓ హేరంబాయనమ: 
  • సింహ రాశి: ఓం లంబోదరయానమ:  
  • కన్యా రాశి: ఓ విఘ్నరాజాయనమ:
  • తుల రాశి: ఓం గణాధ్యక్షాయనమ:
  • వృశ్చిక రాశి: ఓం గజాననాయ నమ:
  • ధనుస్సు రాశి: ఓం పార్వతీనందనాయనమ:
  • మకర రాశి: ఓం గణపతయే నమ:
  • కుంభ రాశి: ఓం ఉమాపుత్రాయ నమ:
  • మీన రాశి: ఓం శూర్పకర్ణాయ నమ:

వినాయకచవితి రోజు ( ఆగస్టు 27)న అన్ని రాశుల వారు గణపతి ఆశీర్వాదం కోసం వారి ప్రకారంగా ఈ మంత్రాలను 1,116 సార్లు పఠించాలి..నవరాత్రి ఉత్సవాల్లో మిగతా రోజుల్లో 108 సార్లు పఠించాలి.  ఈ విధంగా చేయడం వల్ల, వారి జీవితాల్లోని కష్టాలు తొలగిపోయి, సుఖశాంతులు లభిస్తాయి. ఇంకా  జీవితంలో శ్రేయస్సు కలిగి.. చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతుందని .. సానుకూలత లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది.