
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో లక్కీ భాస్కర్ స్టైల్ లో బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో జరిగింది ఈ ఘటన. బ్యాంకు అధికారులు నిర్వహించిన అడిట్ లో రూ. 4 కోట్ల అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... చెన్నూర్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో చేతివాటం ప్రదర్శించారు సిబ్బంది. గత రెండు రోజులుగా బ్యాంకు అధికారులు నిర్వహిస్తున్న అడిట్ లో సిబ్బంది మోసాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది .
ఈ అడిట్ లో పెద్ద ఎత్తున అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకులోని బంగారం, డిపాజిట్ లు, నగదులో లోపాలను గుర్తించినట్లు తెలిపారు అడిట్ అధికారులు.సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బ్యాంకులో పని చేసే క్యాషియర్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
గత రెండు రోజులుగా విచారణ జరుపుతున్న అడిట్ అధికారులు.. ఉన్నతాధికారులు, పోలీసులు సమక్షంలో అవకతవకలపై విచారణ జరుపుతున్నారు. వెలుగులోకి వచ్చిన అవకతవకల్లో పరారీలో ఉన్న క్యాషియర్ పాత్రపై ఆరా తీస్తున్నారు అధికారులు.