
నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడు విజయ్ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తొక్కిలాట చోటు చేసుకుంది. గురువారం (ఆగస్టు 21) తమిళనాడు మధురై లో ఏర్పాటు చేసిన సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. దాదాపు 4 లక్షల మంది సభకు హాజరయ్యారు. రద్దీ ఎక్కువ అవ్వటంతో సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఏకంగా 400 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు.
విజయ్ టీవీకే పార్టీ రెండవ మహానాడు సందర్భంగా తోపులాట కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నాలుగు వందలకు పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు మృతి చెందగా12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. .