
సీఎం చంద్రబాబుపై ఘాటైన వ్యాఖ్యలుచేశారు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంటే.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు నోరు మెదపడం లేదని అన్నారు. నెలకొకసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారని ప్రశ్నించారు బొత్స. రాష్ట్రంలో రైతులు, రైతుకూలీలు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు ఎవరూ బాగోలేరని అన్నారు. ప్రభుత్వ పెద్దలు అవినీతి, దోపిడీ, వ్యక్తిగత స్వార్ధం తప్ప ఏమీ కనిపించడం లేదని అన్నారు బొత్స.
ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడిచినా రైతు భరోసా, కేంద్రం సహాయంతో ఇస్తున్న రూ.20 వేలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 70 నుంచి 80 వేల మందికి రైతు భరోసా అందలేదని అన్నారు. అన్నదాత సుఖీభవ సంవత్సరం పాటు గాలికి వదిలేసారని అన్నారు. అమ్మఒడి మేమేస్తే.. తల్లికి వందనం పేరు చెప్పి ఈరోజుకి కూడా 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు ఇవ్వలేదని అన్నారు బొత్స.
ALSO READ : ఉపరాష్ట్రపతి ఎన్నికతో బీఆర్ఎస్ బండారం బయటపడుతుంది
వితంతు పెన్షన్లు లక్ష మందికి ఒకేసారి ఇస్తున్నామని చెప్పి హడావిడి చేసారని.. ఏడాదిన్నర కాలంలో ఎంతమందికి వితంతు పెన్షన్ ఇచ్చారో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సర్వనాశనం అయిపోయిందని.., ఎవరికి ఎకౌంటబిలిటీ లేదని అన్నారు బొత్స. రాష్ట్రంలో శాంతిభద్రత విషయం కానీ , సంక్షేమ కార్యక్రమాల అంశం కానీ, గత వైసిపి ఐదేళ్ల కాలంలో ఎలా ఉంది అనేది ... ఈ 14 నెల కాలంలో క్రైమ్ రేట్ ని చూస్తే తెలుస్తుందని అన్నారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 32 మంది బలిదానంతో సాధించుకున్నామని.. అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే నిమ్మకు నీరిత్తినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు బొత్స.విశాఖ హుక్కు పై జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైసిపి నేతలంతా పోరాటాన్ని ఉదృతం చేస్తామని.. తమతో కలిసి వచ్చిన అందరినీ కలుపుకుంటామని స్పష్టం చేశారు బొత్స.