
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో గురువారం భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఒక్కరోజు ఎల్లో అలర్ట్ (6.45 సెంటిమీటర్ల నుంచి 11.55 సెంటిమీటర్లు) వర్షం కురిసే చాన్స్ ఉన్నట్లు ప్రకటించింది. మరోవైపు బుధవారం సాయంత్రం నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. అత్యధికంగా హెచ్ సీయూ వద్ద 1.23 సెంటిమీటర్ల వర్షం పడింది. షేక్ పేట్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి వాన పడింది.