
ఓయూ, వెలుగు: ఈ నెల 19న ఇందిరాపార్క్ వద్ద లంబాడీల ఆత్మ గౌరవ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం ఆవిష్కరించారు.
వారు మాట్లాడుతూ.. లంబాడీలు, గిరిజనులపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెల్లం వెంకట్రావు, సోయం బాపూరావు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉన్నారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో కరాటే రాజు, శరత్ నాయక్, నెహ్రూనాయక్, సంపత్ నాయక్, రవీందర్ నాయక్, భీమ్రావు నాయక్ పాల్గొన్నారు.