డెల్టా కంటే లాంబ్డా మరింత ప్రమాదకరం

V6 Velugu Posted on Jul 07, 2021

కరోనా వైరస్ రూపాంతరాలు చెందుతోంది. కొత్తకొత్త వేరియంట్లతో ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం డెల్టా, లాంబ్డా వేరియంట్లు ప్రమాదకరంగా మారాయి. అయితే డెల్టా కంటే లాంబ్డా వేరియంట్ మరింత ప్రమాదకరమని మలేసియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. గత నాలుగు వారాల్లో ఈ వేరియంట్ ను దాదాపు 30 దేశాల్లో గుర్తించారు. ప్రస్తుతం మరిన్ని దేశాలకు ఈ వేరియంట్ విస్తరిస్తోంది. ఈ వేరియంట్ కు లాటిన్ అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా దేశాలు భయపడుతున్నాయి.

కరోనా మరణాల రేటు ఎక్కువగా ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా వైరస్ పుట్టినట్లు మలేసియా ఆరోగ్యశాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది. యూకేలో గుర్తించిన లాంబ్డా వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు ప్రమాదకరమైనదని తెలిపింది. పెరూలో గత రెండు నెలల్లో బయటపడిన కరోనా నమూనాల్లో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. లాంబ్డా వేరియంట్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. 

Tagged Lambda corona variant, more dangerous, Delta

Latest Videos

Subscribe Now

More News