బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ కబ్జాలు, ఇసుక దందాలు : గడ్డం వంశీకృష్ణ

బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ కబ్జాలు, ఇసుక దందాలు : గడ్డం వంశీకృష్ణ

గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. బీఆర్ఎస్ పాలనలో ల్యాండ్ కబ్జాలు, ఇసుక దందాలు, అక్రమ డబ్బు విపరీతంగా ఉండేవని చెప్పారు. కేసీఆర్ నియంతృత్వ పాలనలో తెలంగాణ బందీగా ఉండిపోయిందన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ ఎప్పుడు వారి సొంత లాభాలే చూసుకున్నారని చెప్పారు. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారని తెలంగాణ వచ్చిన తర్వాత ఇలాంటి బతుకు బతుకుతామని ఎవ్వరూ అనుకోలేదని చెప్పారు.

తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని వంశీ కృష్ణ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మంచి పథకాలు ఎన్నో వచ్చాయని అన్నారు. పెన్షన్ను దేశ వ్యాప్తంగా తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. అప్పుల పాలుగా ఉన్న రాష్ట్రాన్ని మంచిగా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని అన్నారు. ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

 

 జీవన్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా చేశారని ఆయనకు ఎంతో అనుభవం ఉందని ప్రజలంతా మంచి మెజారిటీ ఇచ్చి ఆయనను నిజామాబాద్ నుంచి ఎంపీగా గెలిపించాలని కోరారు.