తిరుమల భక్తులకు అలర్ట్​: ఘాట్​ రోడ్లో కొండచరియలు విరిగి పడే అవకాశం

తిరుమల భక్తులకు అలర్ట్​: ఘాట్​ రోడ్లో కొండచరియలు విరిగి పడే అవకాశం

తిరుమలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల నుంచి ( డిసెంబర్​ 3 వ తేదీనుంచి) ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది.  తిరుమల ఘాట్​ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తిరుమలకు వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ తెలిపింది.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల తిరుపతి జిల్లాలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. తిరుపతి పట్టణంతో పాటు తిరుమలలోనూ ఆది, సోమవారాల ( డిసెంబర్​ 3,4 తేదీల) నుంచి వర్షం కురుస్తోంది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీవారి దర్శనానికి అంతరాయం కలుగుతోంది. స్థానికంగా ఉండే ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

 తిరుమలలో ఈదురు గాలులు కూడా వీస్తున్నాయి. ఈ వర్షం మంగళ, బుధవారాలు  ( డిసెంబర్​ 5,6)  కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుపాను  దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తిరుమలలో   భక్తులు  చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షం పడుతున్న సమయంలో భక్తులు సురక్షితం ప్రాంతాల్లో ఉండాలని తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా వాహనాలు నడపాలని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

పాంచజన్యం వద్ద మిచాంగ్ తుపాను ప్రభావం భారీగా చూపుతుంది. రెండు రోజుకుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుంది. ఉదయం నుండి వేగంగా ఈదురుగాలులు కూడిన వర్షం కురుస్తుంది. దీంతో అనేక ప్రాంతాలలో వృక్షాలు నేలకూలాయి. ఘాట్ రోడ్డు వసతి గృహాల వద్ద బారీ వృక్షాలు కూలిపోవడంతో భక్తులు వసతి గృహాలకే పరిమితం అయ్యారు. పాంచజన్యం అతిధి గృహం వద్ద మూడు బారీవృక్షాలు వాహనాలపై పడ్డాయి. దీంతో నాలుగు వాహనాలు ద్వంసం అయింది. సంఘటన సమయంలో వాహనాలలో భక్తులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం. మరో రెండు రోజులు వర్ష ప్రభావం ఉండటంతో భక్తులు అప్రమత్తం గా ఉండాలని టిటిడి కోరుతుంది.