
హైదరాబాద్, వెలుగు: ఎల్ అండ్ టీ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ ఏడాది ఏప్రిల్– జూన్ క్వార్టర్ (క్యూ1) లో రూ.701 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని సాధించింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఇది 10 శాతం, కిందటేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 2 శాతం ఎక్కువ. కంపెనీ రిటైల్ లోన్లలో 18 శాతం వృద్ధి నమోదైంది. కన్సాలిడేటెడ్ లోన్ బుక్ రూ.1,02,314 కోట్లకు చేరుకుంది. కంపెనీ షేర్లు శుక్రవారం 1.80 శాతం పెరిగి రూ.203.25 వద్ద ముగిశాయి.