తమిళనాడులో రూ.57కోట్ల విలువచేసే బంగారు కడ్డీలు సీజ్

తమిళనాడులో రూ.57కోట్ల విలువచేసే బంగారు కడ్డీలు సీజ్

ఎన్నికల సమయంలో డబ్బు, బంగారం, డ్రగ్స్ భారీస్థాయిలో పట్టుపడుతున్నాయి. లేటెస్ట్ గా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో భారీగా బంగారం పట్టుకున్నారు ఎన్నికల అధికారులు. సరిహద్దులోని ఆరంబాక్కంలో రూ.57 కోట్ల విలువచేసే 175 బంగారు కడ్డీలు సీజ్ చేశారు. ఈ బంగారం… ఆంధ్రప్రదేశ్ కు చెందిన సిద్దార్థ్ అనే వ్యక్తికి సంబంధించినదని అధికారులు తేల్చారు. ఈ బంగారం ముంబైకి అక్రమంగా తీసుకెళ్లే ప్రయత్నంలో పట్టుకున్నట్టు పోలీసులు వివరించారు.