లాసెట్‌‌, పీజీఎల్‌‌ సెట్‌‌ షెడ్యూల్‌‌ విడుదల

లాసెట్‌‌, పీజీఎల్‌‌ సెట్‌‌ షెడ్యూల్‌‌ విడుదల

హైదరాబాద్, వెలుగు: టీఎస్ లాసెట్, పీజీఎల్ సెట్‌‌కు ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌‌ రిలీజ్​ చేసింది. శుక్రవారం ఉన్నత విద్యామండలి ఆఫీసులో చైర్మన్ లింబాద్రి నేతృత్వంలో లాసెట్, పీజీఎల్ సెట్‌‌ల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కమిటీ సమావేశమైంది. ఆపై ఎంట్రెన్స్ టెస్టుల షెడ్యూల్‌‌ను రిలీజ్ చేశారు.

ఫిబ్రవరి 28న లాసెట్, పీజీఎల్ సెట్ నోటిఫికేషన్‌‌ రిలీజ్, మార్చి 1 నుంచి ఏప్రిల్‌‌ 15 వరకు ఆన్‌‌లైన్‌‌లో అప్లికేషన్లు స్వీకరిస్తారు. కాగా, ఇంజనీరింగ్, ఫార్మసీల్లో లేటరల్ ఎంట్రీకి ఈసెట్ షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. 14న నోటిఫికేషన్‌‌, 15 నుంచి ఏప్రిల్​16 వరకు ఆన్‌‌లైన్‌‌లో అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు.