యాచారం, వెలుగు: ఇబ్రహీంపట్నం పరిధి యాచారం మండలం మేడిపల్లి గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. రాష్ట్ర సర్కారు రంగారెడ్డి జిల్లాలోని యాచారాం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలో 19 వేల 333 ఎకరాల్లో హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటుచేయనున్న సంగతి తెలిసిందే. అందుకు భూసేకరణ, శాటిలైట్ టౌన్‌షిప్‌ల నిర్మాణం కొనసాగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి మేడిపల్లిలో కొత్తగా హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ పోలీస్ స్టేషన్‌ను ఆదివారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ ప్రారంభించారు.
