World Cup 2025 Final: ఓడినా నువ్వే టాప్: సౌతాఫ్రికా కెప్టెన్ అసాధారణ పోరాటం.. ఆల్‌టైం రికార్డ్

World Cup 2025 Final: ఓడినా నువ్వే టాప్: సౌతాఫ్రికా కెప్టెన్ అసాధారణ పోరాటం.. ఆల్‌టైం రికార్డ్

ఒక ప్లేయర్ నాకౌట్ లో సెంచరీ కొడితే అద్భుతం అంటాం.. అంతులేని ప్రశంసలు వారిపై కురిపిస్తాం. అదే ప్లేయర్ వరుసగా రెండు మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ ల్లో శతాకాలతో విజృంభిస్తే అంతకంటే గొప్ప ఘనత మరొకటి ఉండదు. ఆమె పోరాటం చూస్తే అభినదించకుండా ఉండలేం. ఆమె ఆట చూస్తే ప్రశంసించకుండా ఉండలేం. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై ఏకంగా 169 పరుగులు.. ఫైనల్లో టీమిండియాపై  సెంచరీతో (101) వీరోచిత పోరాటం.. ఇవన్నీ సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ గురించి చెబుతున్న మాటలివి. జట్టుకు ఎంత చేయాలో అంత చేసిన వోల్వార్డ్.. దురదృష్టవశాత్తు తమ దేశానికి వరల్డ్ కప్ అందించలేకపోయింది. 

ఇండియాతో జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ (101) వీరోచిత సెంచరీతో ఆకట్టుకుంది. 299 పరుగుల భారీ ఛేజింగ్ లో సెంచరీ చేసి జట్టు సౌతాఫ్రికా వరల్డ్ కప్ ఆశలను చివరివరకు సజీవంగా ఉంచింది. ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని  డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో జరిగిన ఈ మ్యాచ్ లో 96 బంతుల్లో శతకం బాదిన ఈ సఫారీ కెప్టెన్.. టీమిండియాను టెన్షన్ పెట్టింది. వోల్వార్డ్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లతో పాటు 1 సిక్సర్ ఉంది. సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ పై సెంచరీ చేసిన వోల్వార్డ్.. ఫైనల్లో కూడా శతకం బాది జట్టు విజయం కోసం తీవ్రంగా శ్రమించింది. సెంచరీ తర్వాత వోల్వార్డ్ టీమిండియా ఆనందానికి  అవధులు లేకుండా పోయాయి.   

సౌతాఫ్రికా జట్టును వోల్వార్డ్ గెలిపించలేకపోయినా ఒక ఆల్ టైమ్ రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఒకే వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక  పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించింది. 2025 వరల్డ్ కప్ లో మొత్తం 9 మ్యాచ్ ల్లో 571 పరుగులు చేసిన వోల్వార్డ్.. అగ్రస్థానంలో నిలిచింది. 2022 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (509) రికార్డును ఈ సఫారీ కెప్టెన్ బ్రేక్ చేసి టాప్ లోకి వెళ్ళింది. 497 - 2022లో రాచెల్ హేన్స్ (497), 1997లో డెబ్బీ హాక్లీ (456), 1988లో లిండ్సే రీలర్ (448) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. 

ఒకే ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు 

510* - 2025లో లారా వోల్వార్డ్ 
509 - 2022లో అలిస్సా హీలీ 
497 - 2022లో రాచెల్ హేన్స్ 
456 - 1997లో డెబ్బీ హాక్లీ 
448 - 1988లో లిండ్సే రీలర్ 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఆదివారం (నవంబర్ 2) ముంబైలోని  డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై ఇండియా 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ టైటిల్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ 87 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ వీరోచిత సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ఆల్ రౌండ్ షోతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. షెఫాలీ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి