TATA WPL 2026: 120 బంతుల్లో 74 డాట్ బాల్స్.. RCB జట్టులో అదరగొడుతున్న లేడీ హేజల్ వుడ్

TATA WPL 2026: 120 బంతుల్లో 74 డాట్ బాల్స్.. RCB జట్టులో అదరగొడుతున్న లేడీ హేజల్ వుడ్

ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో జోష్ హేజల్ వుడ్ ఎలాంటి బౌలింగ్ తో ఆకట్టుకున్నాడో తెలిసిందే. పిచ్ తో సంబంధం లేకుండా ఎలాంటి స్టార్ బ్యాటర్ అయినా ఈ ఆసీస్ బౌలర్ కంట్రోల్ చేయగలడు. స్వింగ్, బౌన్స్ తో పాటు లైన్ అండ్ లెంగ్త్ తో దడ పుట్టే బంతులను వేస్తాడు. గత సీజన్ ఐపీఎల్ లో హేజల్ వుడ్ పవర్ ప్లే బౌలింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. బ్యాటర్లు రెచ్చిపోయే పవర్ ప్లే లో.. హేజాల్ వుడ్ తన వైవిధ్యమైన బంతులతో డాట్ బాల్స్ వేసేవాడు. డాట్ బాల్స్ వేయడంలో ఈ ఆసీస్ పేసర్ తనకు తానే సాటి. మహిళా  ప్రీమియర్ లీగ్ లో కూడా ఒక పేసర్ హేజాల్ వుడ్ ను గుర్తు చేస్తుంది. 

డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)  అమ్మాయిలు రప్ఫాడిస్తున్నారు. ఆడిన ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్లోనూ గెలిచి అందరికంటే ముందే ప్లేఆఫ్స్‌‌‌‌ బెర్తు  ఖరారు చేసుకున్నారు. ఈ సీజన్ లో ఆర్సీబీ విజయాల్లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ లారెన్ బెల్ తన బౌలింగ్ తో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఆడిన మ్యాచ్ ల్లో పొదుపుగా బౌలింగ్ చేసింది. 5 మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొట్టిన బెల్.. ఓవరాల్ గా 120 బంతుల్లో ఏకంగా 74 డాట్ బాల్స్ వేసి ఆశ్చర్యపరిచింది. ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు ఓవర్ల కోటా వేసిన ఈ ఇంగ్లాండ్ పేసర్ ఒక్క మ్యాచ్ లో కూడా 30 పరుగులు ఇవ్వకపోవడం విశేషం. 

తొలి మ్యాచ్ ల్లో నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. రెండు మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసుకుంది. మూడో మ్యాచ్ ల్లో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు.. నాలుగో మ్యాచ్ లో 26 పరుగులు ఇచ్చి మూడు వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా సోమవారం (జనవరి 19) గుజరాత్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పై నాలుగు ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి వికెట్ తీసుకుంది. పవర్ ప్లే లో లారెన్ బెల్ ప్లేయర్లను కట్టడి చేయడంతో ఆర్సీబీ జట్టుకు పట్టు లభిస్తోంది. బెల్ బౌలింగ్ ను పొగుడుతూ ఫ్యాన్స్ లారెన్ బెల్ నుఆర్సీబీ మెన్స్ జట్టులోని జోష్ హేజాల్ వుడ్ తో పోలుస్తున్నారు. ఆర్సీబీ మహిళా జట్టులో కూడా ఒక హేజల్ వుడ్ ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ప్లే ఆఫ్స్ కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: 

సోమవారం (జనవరి 19) జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆర్సీబీ 61 రన్స్ తేడాతో  గుజరాత్ జెయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన బెంగళూరు  నిర్ణీత 20 ఓవర్లలో  178/6 స్కోరు చేసింది. యంగ్ సెన్సేషన్  గౌతమి నాయక్ (55 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 73) మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. రిచా ఘోశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (27), కెప్టెన్ స్మృతి మంధాన (26) కూడా రాణించారు.  గుజరాత్ బౌలర్లలో కాశ్మీ గౌతమ్, గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్ 20 ఓవర్లలో 117/8  స్కోరు మాత్రమే చేసి ఓడింది. కెప్టెన్ యాష్లే గార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (43 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో 54) తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిలయ్యారు. సయాలీ సత్ఘారే (3/21) మూడు వికెట్లతో దెబ్బకొట్టింది. గౌతమి నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది.