మేము కలలు కన్నాము.. అదే జరిగింది.. పెళ్లి తరువాత లావణ్య ఎమోషనల్ పోస్ట్

మేము కలలు కన్నాము.. అదే జరిగింది.. పెళ్లి తరువాత లావణ్య ఎమోషనల్ పోస్ట్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. దాదాపు ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. వారు మొదటిసారి కలుసుకున్న ప్రేదేశం ఇటలీలో వివాహం చేసుకున్నారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీతో పాటు అతి కొద్దీ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు.  

ఇదెలా ఉండగా.. పెళ్లి జరిగిన తరువాత నుండి సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉన్న లావణ్య తాజాగా తన పెళ్లి గురించి, భర్త వరుణ్ తేజ్ గురించి స్పెషల్ పోస్ట్ పెట్టారు.. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, నన్ను బాగా చూసుకునే వ్యక్తి నాకు భర్తగా వచ్చారు. ఈసమయంలో నేను చెప్పుకోవడానికి చాలా ఉంది కానీ.. దాన్ని మా ఇద్దరిమధ్యే ఉంచాలనుకుంటున్నాను. మేము ముందు నుండి  కలలు కన్నట్టుగా.. మూడు రోజుల పెళ్లి మా కుటుంబాలతో, మా సన్నిహితులతో కలిసి జరుగుపుకున్నాము. ఈ వేడుకను ప్రత్యకంగా చేసినందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు.. అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు లావణ్య.  

ఇక ఈ నోట్ తోపాటు కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు లావణ్య. ఆ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, వరుణ్ లావణ్య జంట ఫోటోలు ఉన్నాయి. పెళ్ళో కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన లావణ్య చీర. ఆ చీరపై వరుణ్ లావ్ అనే సింబల్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.