
పేరుకు తగ్గట్టు గ్లామర్‌తోనే కాకుండా పెర్‌ఫార్మెన్స్‌తోనూ ఆకట్టుకుంది లావణ్య త్రిపాఠి. అందుకే ఎంట్రీ ఇచ్చి పదేళ్లయినా సక్సెస్ ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా హీరోయిన్‌గా కొనసాగు తోంది. ఈసారి ఓ పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో నటించిందామె. ‘పులి మేక’ పేరుతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 24 నుండి స్ట్రీమింగ్ అవనుంది. ఆది సాయి కుమార్, సిరి హన్మంత్, సుమన్, రాజా ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ ఒరిజినల్ సిరీస్ ట్రైలర్‌ను శుక్రవారం రామ్ చరణ్ లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్ చేసిన ఓ సీరియల్ కిల్లర్ పోలీసులను చంపుతుంటాడు. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటుచేస్తారు. దానికి హెడ్ కిరణ్ ప్రభగా నటిస్తోంది లావణ్య త్రిపాఠి. అదే టీమ్‌లో ఫోరెన్సిక్ టీమ్ మెంబర్ ప్రభాకర్ శర్మగా ఆది కనిపిస్తున్నాడు. ఈ కేసును లావణ్య ఎలా సాల్వ్ చేసింది.. ఇంతకు ఆ హత్యలు చేస్తున్న పులి ఎవరు అనేది అసలు కథ. కోన ఫిల్మ్ కొర్పొరేషన్, జీ5 సంస్థలు కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.