జూన్ 26న లాసెట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ !

జూన్ 26న లాసెట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ !
  • వచ్చే నెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరణ
  • 25న పీజీఈసెట్ నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే లాసెట్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫీస్​లో సోమవారం చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లాసెట్, పీజీఈసెట్ అడ్మిషన్స్ సెట్స్ చర్చించారు. రిజల్ట్ వచ్చిన ఆయా సబ్జెక్టులకు మాత్రమే అడ్మిషన్ల ప్రక్రియ తొలుత ప్రారంభించాలని నిర్ణయించారు.

ఇందులో భాగంగా ఈనెల 26న లాసెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. మూడేండ్లు, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సులకు జులై 2 నుంచి రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఎల్ఎల్బీ రిజల్ట్ ఇంకా రాకపోవడంతో ఎల్ఎల్ఎం అడ్మిషన్ల ప్రక్రియను జులై నెలాఖరులో చేపట్టాలని డిసైడ్​అయ్యారు.

25న పీజీ ఈసెట్ నోటిఫికేషన్..
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈనెల 25న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. బీటెక్ రిజల్ట్స్ రావడంతో వెంటనే రిజిస్ర్టేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నది. అయితే, బీఫార్మసీ ఫలితాలు ఇంకా పెండింగ్ లో ఉండటంతో ఎంఫార్మసీ అడ్మిషన్ల ప్రక్రియను జులై చివరి వారంలో ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు.