ఎన్టీఆర్ వెన్నుపోటులేని రాజకీయాలు చేశారు

ఎన్టీఆర్ వెన్నుపోటులేని రాజకీయాలు చేశారు

ఎన్టీఆర్  జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులర్పించారు కుటుంబ సభ్యులు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో పాటు... పురంధేశ్వరి వేర్వేరుగా వచ్చి అంజలి ఘటించారు.. ఆ తర్వాత నందమూరి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ కు నివాళుర్పించారు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శమన్నారు కుటుంబ సభ్యులు. మరోవైపు ఎన్టీఆర్ వెన్నుపోటులేని రాజకీయాలు చేశారన్నారు లక్ష్మీపార్వతి.

తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు నందమూరి బాలకృష్ణ. కృష్ణా జిల్లా నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వెళ్లిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక చేసిన అనంతరం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టేలా నేనున్నానంటూ ఎన్టీఆర్ ముందుకొచ్చారని బాలకృష్ణ తెలిపారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పేదలకు ఇళ్లు ఇచ్చారని చెప్పారు. నిమ్మకూరును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ఆయన..నిమ్మకూరు చెరువు వద్ద ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.